Home Minister Anitha: కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్‌రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు.. క్రిమినల్ రాజకీయ నాయకుడు అయితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అర్థం అవుతుందన్న ఆమె.. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇసుక లూటీ కోసం ఉపయోగించిన బోట్లు ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయడానికి వాడారు… కౌంటర్ వెయిట్స్ కు కాకుండా పిల్లర్స్ కూలిపోయి వుంటే నష్టం మాటలకు అందేది కాదన్నారు.. బోట్లు పోయాయి అని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు.. ఉద్దడంద రాయుడు పాలెం దగ్గర వుండాల్సిన బోట్లు బ్యారేజ్ ఎగువకు ఎలా వచ్చాయి..? అని నిలదీశారు.
Read Also: Duleep Trophy 2024: సెకండ్ రౌండ్.. ఇండియా A కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్..
ఇక, ఈ ఘటన వెనుక బాధ్యులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అనిత.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఐదు బోట్లు వదిలితే రెండు మునిగిపోయి.. మరో మూడు కౌంటర్ వేయిట్స్ దెబ్బతీశాయి.. వైసీపీ రంగులు వేసి వున్న బోట్లు ఎవరివో తేల్చి బాధ్యులు అందరిపైనా చర్యలు తీసుకుంటాం అన్నారు.. మొరిగేవాళ్లను.. మేం పట్టించుకోం.. వైసీపీ నాయకులు హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడు పనితీరు, క్రైసిస్ మేనేజ్ మెంట్ ఎలా వుంటుందో ఆ పార్టీలో రాజకీయాలు ప్రారంభించిన మాజీ మంత్రి అమర్నాథ్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లెందుకు సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రయత్నాలు చేస్తున్నారు.. వరదలకు సీఎం, హోంమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఇల్లా అనే తేడా వుండదు.. సిగ్గు లేకుండా… జరుగుతున్న సహాయ చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వరదల నష్టం అంచనాలు వేగవంతంగా జరుగుతున్నాయి .. వరదలు కారణంగా దెబ్బతిన్న వాహనాలు, ఇతర సామాగ్రి మరమ్మత్తుల కోసం అవసరం అయిన నష్ట పరిహారంపై వర్కవుట్ చేస్తున్నాం.. విజయవాడ వరదలను ఓ కేసు స్టడీగా తీసుకుని సహాయ చర్యలపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం.. నదులు, వాగులు పరీవాహక ప్రాంతాల్లో అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఏలేరు వరదలలో సహాయ చర్యలు విస్తృతంగా జరుగుతున్నాయి.. విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతాల పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించాం.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటిగట్లు కోసం కేంద్రం సహకారం తీసుకుంటాం అన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత.