Nandamuri Balakrishna: అసెంబ్లీ లాబీలో బాలయ్య సరదా సంభాషణ.. నెక్ట్స్ ప్రాజెక్ట్ లీక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే తర్వాత ఏ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు.. ఏ దర్శకుడితో సినిమా తీయబోతున్నారు.. ఏ హీరోయిన్‌తో జత కట్టబోతున్నాడు అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న వేళ.. తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఓ లీక్ ఇచ్చారు బాలయ్యా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సరదా వ్యాఖ్యలతో అందరినీ అలరించారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బొజ్జల సుధీర్, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో బాలకృష్ణ చర్చించారు. ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజును “డాకూ మహారాజ్” అంటూ సరదాగా సంభోదించారు. హంద్రీనీవా నీళ్లను హిందూపురం కాకుండా మడకశిరకు తీసుకెళ్తూ రాజు “డాకూ మహారాజ్” అయ్యాడని చమత్కరించారు. దీనికి స్పందించిన ఎం.ఎస్. రాజు, వెనుకబడిన ప్రాంతమైన మడకశిరకు ఆ మేర నీటి అవసరం ఉందని, పెద్దమనసుతో చూడాలని కోరారు.
Read Also: మ్యాట్ ఫినిష్ బ్యాక్, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d బడ్జెట్ 5G ఫోన్ లాంచ్!
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్‌న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో ముందుకు ఏపీ.. సింగపూర్‌లో చంద్రబాబు కీలక ప్రసంగం
ఇక, హిందూపురం ప్రజలతో పాటు మడకశిర ప్రజలు కూడా అభివృద్ధి చెందాలని బాలకృష్ణ ఆకాక్షించారు.. అయితే హిందూపురానికి కూడా పది రోజుల నీటి అవసరం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం హాజరుకాలేదా అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా, గవర్నర్ ప్రసంగానికి వచ్చి 11 నిమిషాల్లోనే 11 మంది బయటకు వెళ్లిపోయారని ఇతర ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. మరోవైపు.. రాజకీయాల మధ్యలో సినిమాల చర్చ కూడా సాగింది. తదుపరి సినిమా ఏంటని ఎమ్మెల్యేలు ప్రశ్నించగా, దర్శకుడు మలినేని గోపీచంద్‌తో మంచి కథ కుదిరిందని బాలయ్య వెల్లడించారు. త్వరలోనే గోపీచంద్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ లాబీలో జరిగిన ఈ సరదా సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?