Cyclone Montha: మొంథా తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తోంది.. దీంతో, రెడ్ అలర్ట్ జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మొంథా కొనసాగుతుండగా.. గత 6 గంటల్లో గంటకు 17 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.. ప్రస్తుతం మచిలీపట్నంకి 190 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకు 270 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకు 340 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.. ఇక, గోపాలపూర్ (ఒడిశా) 550 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోంది.. తుఫాన్ ఈ సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం – కాళింగపట్నం మధ్యలో, కాకినాడ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది.. గాలి వేగం గంటకు 90–100 కిలో మీటర్లు.. అంత కంటే ఎక్కువగా గంటలకు 110 కిలో మీర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. రాబోయే కొన్ని గంటల్లో ఏపీ తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతన్నారు..
Read Also: Bihar Election: నేడు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల.. ప్రధాన హామీ ఇదే!
తుఫాను ప్రభావంతో కాకినాడలో రద్దీగా మారాయి కూరగాయల మార్కెట్లు, సూపర్ బజార్లు.. వారం రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యవసర వస్తువులు స్టోర్ చేసుకుంటున్నామంటున్న పబ్లిక్.. సాయంత్రం తుఫాన్ తీరం దాటితే బయటికి వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో అని అప్రమత్తం అవుతున్నారు.. తుఫాను ప్రభావంతో మార్కెట్లకు రైతుల నుంచి కూరగాలు కూడా తక్కువ సంఖ్యలోనే వచ్చాయి.. అయితే, ఉన్న వాటినే కొనుక్కుని తీసుకుని వెళ్తున్నారు ప్రజలు.. మరోవైపు, బాపట్లలో మొంథా తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది.. ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండగా.. అధికారులను అప్రమత్తం చేసింది జిల్లా యంత్రాంగం.. బాపట్ల లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు.. తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు గస్తీ కాస్తున్నారు పోలీసులు..
తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.. తీర ప్రాంత మండలాలపై ప్రభావం చూపుతోంది తుఫాన్.. గత రాత్రి నుంచి తీర ప్రాంత మండలాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. అరగంట పాటు కురిసిన వర్షంతో నెల్లూరులోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన యంత్రాంగం.. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా నమోదు అవ్వని భారీ వర్షాలు.. అత్యధికంగా 16.6 mm వర్షపాతం నమోదు అయ్యింది..
