Cyclone Montha: మొంథా తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తోంది.. దీంతో, రెడ్ అలర్ట్ జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మొంథా కొనసాగుతుండగా.. గత 6 గంటల్లో గంటకు 17 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.. ప్రస్తుతం మచిలీపట్నంకి 190 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకు 270 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకు…
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం పైపు దూసుకొస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది.. ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని.. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది.