NTV Telugu Site icon

AP High Court: నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ..

Ap High Court

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు.. పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు.. కాగా, సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. తన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్వాష్‌ పిటిషన్‌ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్‌ అయి తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. అయితే ఈ కేసులో ఈ రోజు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు..

Read Also: Haryana Elections : నేడు హర్యానాలో ఎన్నికల పోరులోకి దిగనున్న మోదీ… గోహనాలో ర్యాలీ

మరోవైపు.. సంచలనం సృష్టించిన ముంబై సినీ నటి జిత్వానీ కేసులోనూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. హైకోర్టులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.. జిత్వానీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు గున్ని.. ఆ పిటిషన్‌ నేడు హైకోర్టులో విచారణకు రానుంది.. ఇక, ఏపీ హైకోర్టులో జోగి రమేష్ బాబాయ్ జోగి వేంకటేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏ1గా ఉన్న జోగి వేంకటేశ్వర రావు వేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేయనుంది హైకోర్టు.. అయితే, జోగి రాజీవ్ ను అరెస్టు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్నారు జోగి వేంకటేశ్వర రావు.. మరోవైపు.. హైకోర్టులో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ, సీఐడీ కేసుల్లో నిందితుడుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు.. ఆ పిటిషన్లపై కూడా నేడు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు..