NTV Telugu Site icon

Andhra Pradesh: ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జీవో జారీ

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ మేరకు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొంది ప్రభుత్వం.. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం అని అభిప్రాయపడింది.. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొంది.. ఇకపై ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లో నూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది సాధారణ పరిపాలన శాఖ.. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్‌లోడ్‌ చేయాల్సిందిగా సూచించిన సర్కార్‌.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సూచనలు ఇచ్చింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్‌ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్..

Read Also: India-China: లడఖ్‌లో ఏర్పాటు చేసిన చైనా కౌంటీలపై భారత్ అభ్యంతరం

Show comments