Payyavula Keshav: ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..? అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్‌పై రిప్లై ఇస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ వ్యాఖ్యానించారు.. సిగరెట్ పెట్టెల మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చినట్లు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.. ఇక, గత, ప్రభుత్వం చేసిన అప్పులపై స్పందిస్తూ.. 9 శాతానికి మించి ఉన్న అప్పులను గుర్తించాం.. దాదాపు 141 రుణాలు ఉన్నాయి. కొన్ని దాదాపు 13.4 శాతం వరకు వడ్డీకి తెచ్చారు. 9 శాతం.. 10 శాతం.. 11 శాతం.. 12 శాతం.. ఇలా పెంచుకుంటూ పోతూ ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారంటే.. వీళ్లనేమనాలి..? అని నిలదీశారు..
Read Also: SLBC Tragedy: టన్నెల్‌లో భయానకమైన పరిస్థితి నెలకొంది: డిజి నాగిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా గత ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఈ రోజుకు ఆ సంస్థకు 154 కోట్ల రూపాయల మేర అప్పు ఉంది.. ఈ అప్పును 13.4 శాతం మేర వడ్డీకి తెచ్చారని వివరించారు పయ్యావుల.. అంటే సంవత్సరానికి ఈ అప్పుపై వడ్డీనే 20.60 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరపాల్సి వస్తుందన్నారు.. ఇప్పుడు మేం బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం.. బ్యాంకర్లు అంగీకరిస్తే.. ఆ వడ్డీ రేటు 9 శాతానికి తగ్గుతుంది. అప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ 13.83 కోట్లు రూపాయలుగా ఉంటుందన్నారు. అంటే ఈ ఒక్క రుణం మీదే 6.76 కోట్ల రూపాయల మేర భారం తగ్గుతుంది. ఇలా 1 లక్ష కోట్ల రూపాయల అప్పు మీద వడ్డీ రేట్లు తగ్గితే.. రాష్ట్ర ఖజానాపై భారం ఎంత వరకు తగ్గుతుందో ఆలోచించండి అని సూచించారు. బ్యాంకర్లతో నెగోషియేషన్స్ మొదలయ్యాయి… ఈ నెలాఖరుతో వడ్డీ రేట్లు తగ్గించగలమనే ఆశాభావంతో ఉన్నాం అన్నారు.
Read Also: Dragon : మా సినిమా చూడండి.. మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసిన తమిళ దర్శకుడు
SASCI – ఈ స్కీం ద్వారా కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒక వెసులుబాటు కల్పించింది … క్యాపిటల్ ఎక్స్ పెడించర్ మీద పెట్టే పెట్టుబడులకు దీర్ఘకాలానికి రుణాలు అందిస్తోంది.. FRBM లిమిట్‌లోకి రాదు.. వడ్డీ లేదని తెలిపారు పయ్యావుల కేశవ్.. 50 ఏళ్ల తర్వాత రీ-పేమెంట్ మొదలవుతుంది. గత ప్రభుత్వం 4079 కోట్లు ఉపయోగిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే 7203 కోట్లను రుణంగా తీసుకున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ వళ్ల ఇదే ఉపయోగం.. గత ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి కేసుల గురించి లాబీయింగ్ చేసుకున్నారే తప్ప.. రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదు. గత ప్రభుత్వం భవిష్యత్ మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో 50 ఏళ్ల వరకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేని విధంగా రుణాలను తీసుకొస్తోందని వెల్లడించారు.