NTV Telugu Site icon

RK Roja: విజయవాడ ప్రజల కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది.. మంత్రులు ఏం చేస్తున్నారు..?

Roja

Roja

RK Roja: విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు. ఎంతమంది వరదల్లో కొట్టుకువెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి.. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపల్యమే కారణం.. మంత్రులు విహార యాత్రలకు వెళ్లి.. ప్రజలను వరదల్లో ముంచేశారు. ఇదేదో నేను విమర్శించడానికి చెప్తున్న మాట కాదు.. మనం ఏ టీవీ చూసినా, తెలుగుదేశం పార్టీ చానళ్లు చూసినా ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో తెలుస్తుంది.. జనాన్ని మూడు రోజుల పాటు ఎలా గాలికొదిలేశారో వాళ్ల మాటల్లోనే మనకు అర్థమవుతుందన్నారు.

Read Also: Imran Khan: హైకోర్టులో ఇమ్రాన్‌ ఖాన్‌ పిటిషన్.. సైనిక కస్టడీకి ఇవ్వొద్దని వినతి

విజయవాడ మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం ఐదురోజులైన కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణం అన్నారు రోజా.. వరద సహాయ చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆమె.. చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారంటే.. ఇది ముమ్మాటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం.. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా.. విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదు.. నాలుగు రోజుల పాటు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా కష్టాలు పడ్డారంటే…ఇంతకంటే ఘోరమైన వైఫల్యం మరొకటి ఉండదు.. నాలుగు రోజుల పాటు సుమారు మూడు లక్షల మందిని ముంచేసి కనీసం నీళ్లు, పాలు కూడా అందించకపోవడం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు.. ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకు వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ, ప్రజల కష్టాల కోసం ఆలోచించడం లేదు.. ఈనెల 29,30 వ తేదీల్లో సీఎం నుండి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు.. 28 వ తేదీనాడే వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయి అయినా సమాచారం ఇచ్చినా.. కనీసం సీఎం చంద్రబాబు కానీ.. హోంమంత్రి కానీ, పంచాయతీరాజ్ మంత్రి కానీ, రెవెన్యూ మంత్రికానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి సమీక్ష కూడా చేయలేదు.. ప్రభుత్వం భారీ వర్షాలపైనా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన 10 మంది ప్రాణాలు పోయాయి అంటూ మండిపడ్డారు.

Read Also: Manjira River: ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం

వరదల కోసం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన ఏకంగా మూడు లక్షల మంది విజయవాడ సెంట్రల్, వెస్ట్, మైలవరం, నందిగామ, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జనం వరదలో చిక్కుకుపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రోజా.. మా జగనన్న ప్రభుత్వం లో ఉన్నప్పుడు వర్షాలు, వరదలు, తుఫాన్లు వస్తాయన్న సమాచారం ఉంటే.. ముందుగానే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లం… పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, పాలు, మంచినీళ్లు అందించేవాళ్లం.. అంతేకాదు వరద, తుఫాన్ బాధితులకు వాళ్ల ఇళ్లకు కూడా ఆహారం, నిత్యవసరాలు పంపిణీ చేసేవాళ్లం.. జగనన్న నిరంతరం అధికారులతో సమీక్షలు జరిపి, ఆయన చుట్టూ అధికారులను తిప్పుకోకుండా ప్రజలకు ముందు సహాయ చర్యలు అందేలా చేసేవారు.. ఈరోజు విజయవాడ వరదల్లో అలాంటి సహాయం ఎవ్వరికైనా ఇంటికి వెళ్లి అందించారా.. అధికారులను కనీసం సీఎం కానీ, మంత్రులు కానీ ముందుగా సిద్ధం చేశారా..? ఈ మంత్రులు ఏం చేస్తున్నారు… అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

Show comments