Site icon NTV Telugu

AP DSC 2025: సుప్రీంకోర్టులో లైన్‌ క్లియర్‌.. షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ..

Dsc

Dsc

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ, టెట్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ చేసింది సుప్రీంకోర్టు.. దీంతో, ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..టెట్‌, డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడుతూ.. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, మీకు ఏవైనా సమస్యలు ఉంటే.. హైకోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం పేర్కొంది.. అంతేకాదు.. టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. దీంతో, ఏపీలో టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగనుంది. కాగా, మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్‌ 20వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విదితే.. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. జూన్‌ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read Also: Imran Khan: భారత్ మరో దాడి చేస్తుంది.. పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version