Site icon NTV Telugu

AP DSC: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Ap Dsc

Ap Dsc

AP DSC: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు… కానీ, ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ నిబంధన అమలు చేస్తున్నారు.

Read Also: Kaleshwaram Investigation: నేటి నుంచి ప్రారంభం కానున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ

కాకినాడలో 6 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.. 41,107 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.. విక, విజయనగరంలో ఐదు పరీక్షా కేంద్రాల్లో 36,495 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు.. సీతం కాలేజ్‌, ఐయాన్ డిజిట‌ల్‌, లెండి ఇంజ‌నీరింగ్, ఎంవిజిఆర్ ఇంజ‌నీరింగ్‌, అవంతి క‌ళాశాల‌ల్లో ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఏలూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు.. పరీక్షా కేంద్రాలుగా వట్లూరు సిద్ధార్థ క్విస్ట్ సిబిఎస్ఈ స్కూల్, వట్లూరు సర్ సి ఆర్ ఆర్ ఇంజ‌నీరింగ్ కళాశాల ఉండగా.. 17,584 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, గడియారాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడవు.. సందేహాలు, వివరణల కోసం అభ్యర్థులు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు 90307 23444, 95056 44555 సంప్రదించవచ్చు..

Read Also: Shashi Tharoor: ఆపరేషన్ సింధూర్ గురించి శశి థరూర్ ను ప్రశ్నలడిగిన కుమారుడు.. తండ్రి చెప్పిన సమాధానం ఇదే!

ఇక, విశాఖలో 12 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు.. 57,895 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.. కొమ్మాది చైత‌న్య ఇంజ‌నీరింగ్ కాలేజ్‌, పెద గంట్యాడ ఎస్.వి.ఎస్. సొల్యూష‌న్స్, షీలా న‌గర్, చిన‌ముషిడివాడ-1, 2 ఐయాన్ డిజిట‌ల్ సెంట‌ర్లు, ఎన్ఎస్టీఎల్ దగ్గర ఏడీజ‌డ్ ఆర్వోనా డిజిట‌ల్, మ‌ధురువాడ, రుషికొండ‌ గాయిత్రీ విద్యా ప‌రిష‌త్, దువ్వాడ విజ్ఞాన్, కాపు జ‌గ్గ‌రాజుపేట విజ్ఞాన్, శొంఠ్యాం ఎన్.ఎస్.ఆర్.ఐ.టి., న‌రవ విట్స్ క‌ళాశాలల్లో ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.. అన్నమయ్య జిల్లాలో మదనపల్లెలో 3, రాజంపేటలో 1, రాయచోటిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 17851 మంది అభ్యర్థులు మెగా డీఎస్సీ రాయబోతున్నారు..

Exit mobile version