NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan tweet: వాటిపైనే ఫిర్యాదులు.. పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర ట్వీట్..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan tweet: తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్న ఆయన.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ ఫిర్యాదులలో గణనీయమైన సంఖ్యలో @KAKINADAPOLICE మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి వస్తున్నాయని తెలిపారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ ఫిర్యాదులపై దృష్టి సారించి, కఠినంగా వ్యవహరించాలని నేను కోరుతున్నాను అన్నారు.

Read Also: Pushpa 2 : ‘కిసిక్’ సాంగ్ పాడింది వీళ్లే.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?

ఇక, ఈ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు పోలీసు సూపరింటెండెంట్‌లను కోరుతున్నాను అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు పవన్‌ కల్యాణ్‌.. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి, మా ప్రభుత్వం నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్‌వర్క్‌ను సమగ్రంగా మార్చే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తీసుకొచ్చింది.. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు మరియు టైటిల్ వెరిఫికేషన్ మరియు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని తెలిపారు.. మా NDA ప్రభుత్వం ప్రభుత్వ భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం మరియు రాష్ట్ర వనరులను రక్షించడంలో నేరస్థులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పోస్టు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..