Deputy CM Pawan Kalyan: వైసీపీపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ పాలిటిక్స్‌లో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోంది.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన తప్పు కాదని, కావాలనే, తెలిసే చేసిన చర్యలేనని అన్నారు.
2019–2024 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రం నలుమూలల 200కుపైగా మత సంబంధిత ఘటనలు చోటుచేసుకున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్ ఉన్నట్టు నివేదికలు రావడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. రాజకీయ లాభనష్టాలు ఆలోచించకుండా, తెలిసిన నిజాన్ని చెప్పకపోతే అది తప్పవుతుందని స్పష్టం చేశారు. గత పాలకులు భగవంతుడిపై పగ పట్టినట్లుగా వ్యవహరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలు తయారు చేసిన ఘటనలు ఉన్నాయి.. దుర్గమ్మ ఆలయంలో వెండి విగ్రహాల చోరీ జరిగితే ‘ఇంకోటి కొనుక్కోవచ్చు’ అన్న ధోరణి.. అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతి కావడం.. ఇలాంటి అనేక సంఘటనలు వైసీపీ పాలనలో జరిగాయని గుర్తు చేశారు.
Also Read
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
NDDB నివేదికే ఆధారం
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో స్వచ్ఛమైన నెయ్యి లేదని NDDB నివేదిక స్పష్టంగా తేల్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు నిజాలు వెల్లడించారని చెప్పారు. 319 రూపాయలకు నెయ్యి సరఫరా జరిగిందంటే ఎంత స్థాయిలో కల్తీ జరిగిందో అందరికీ అర్థమవుతుందన్నారు. ఇక, ఈ వ్యవహారంపై వచ్చిన సీబీఐ నివేదిక ఎక్కడా క్లీన్ చీట్ ఇవ్వలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. NDDB నివేదికలో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, రసాయనాలు ఉండే అవకాశాలున్నాయని పేర్కొనడం మరింత తీవ్ర విషయమని అన్నారు. అయితే, తప్పు జరిగిందని ఒప్పుకోకుండా, పశ్చాత్తాపం చూపకుండా, తిరిగి ‘ఎలాంటి తప్పులు జరగలేద’ని ప్రచారం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వైసీపీ ఈ వ్యవహారంపై తప్పకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హిందూ మత గౌరవం కాపాడుతున్నాం
తాము హిందూ మత గౌరవాన్ని కాపాడుతున్నామని, కానీ ఇతర మతాలను ఎక్కడా అగౌరవపరచడం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదని, భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదని, మళ్లీ నివేదికలు వచ్చేందుకు సమయం పడుతుందని, అప్పటివరకు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘ఏడు కొండల వారితో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!