NTV Telugu Site icon

CM Chandrababu: నితీష్ కుమార్ రెడ్డికి త్వర‌లో ఇంటి స్థలం.. సీఎం హామీ

Nitish

Nitish

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఏసీఏ కార్యద‌ర్శి, రాజ్యస‌భ ఎంపీ సానా స‌తీష్ కూడా ఉన్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివ‌నాథ్ ప్రక‌టించిన రూ.25 ల‌క్షల చెక్కును నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు బ‌హుక‌రించారు. నితీష్ కుమార్ రెడ్డికి అతి త్వర‌లో ఇంటి స్థలం కేటాయిస్తామ‌ని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read Also: Bengaluru: ప్రైవేటు ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. మహిళ టెక్కీ ఆత్మహత్య

రాష్ట్రంలోని అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌కు అండ‌గా ఉండి అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో తన బ్యాటింగ్‌తో నితీష్ కుమార్‌ రెడ్డి స‌త్తా చాటాడు. దీంతో.. నితీష్ కుమార్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. అనంతరం.. నితీష్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

Read Also: KTR : లై డిటెక్టర్ పరీక్ష జరిపిద్దాం… మీడియాలో లైవ్ చూపిద్దాం…

నితీష్ కుమార్ రెడ్డి అతి తక్కువ సమయంలోనే క్రికెట్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అద్భుత ఆటతీరుతో టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బీజీటీ సిరీస్‌లో అద్భుత సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.. అనంతరం సంక్రాంతి వేడుకల్లో కూడా పాల్గొన్నాడు.