NTV Telugu Site icon

Collectors Conference: రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. ప్రధానంగా వీటిపైనే ఫోకస్‌..

Collectors Conference

Collectors Conference

Collectors Conference: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సిద్ధమైంది.. వ‌చ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధ‌నే ల‌క్ష్యంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు క‌లెక్టర్ల స‌ద‌స్సు నిర్వహించ‌నుంది ఏపీ ప్రభుత్వం.. స‌చివాల‌యంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది.. గ‌తానికి భిన్నంగా క‌లెక్టర్ల స‌ద‌స్సు నిర్వహించడానికి సర్కార్‌ సిద్ధమైంది.. వ‌చ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పధకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పి.ఫోర్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చ జరగనుంది..

Read Also: Suhas : రిపోర్టర్ ప్రశ్న.. నాకేంటి ఈ టార్చర్ అంటున్న హీరో..

రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు.. పాలనలో మార్పులు.. పీ 4 సంక్షేమ పథకాలు ప్రధాన అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. పీఎం సూర్య ఘ‌ర్ పేరుతో ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో 10 వేల ఇళ్లపై రూఫ్ టాఫ్ లు ఏర్పాటు చేయ‌డంపై కూడా ప్రభుత్వం ఈ స‌ద‌స్సులో ఫోక‌స్ పెట్టింది.. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కార్యాచరణ పై నివేదికలు సిద్ధం అయ్యాయి. ప్రతి మూడు నెల‌ల‌కు ఒక సారి క‌లెక్టర్ల స‌ద‌స్సు నిర్వహించాల‌ని ఏపీ ప్రభుత్వం భావించింది.. దీనిలో భాగంగా ఇప్పటికే కుట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చాక రెండు సార్లు క‌లెక్టర్ల స‌ద‌స్సు నిర్వహించిన ప్రభుత్వం.. రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు మరోసారి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది.. 15 శాతం వృద్ధే లక్ష్యంగా రానున్న ఏడాది కాలానికి రాష్ట్రంలోని 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను రెండు రోజుల పాటు అమరావతిలో జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించనున్నారు.. రెండు రోజుల ఈ సమావేశంలో మొదటి రోజు 9,రెండో రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తారు.. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటెష‌న్ ఇవ్వనున్నారు.. ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయించారు.. ఇందులో 10 నిమిషాలు కార్యాచరణ ప్రెజెంటేషన్, ఐదు నిమిషాలు సమస్యల వివరణ, ఇంకో ఐదు నిమిషాలు వాటిపై చర్చించ‌నున్నారు.. తమ జిల్లాల్లో వివిధ సమస్యలను కలెక్టర్లు ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు.

Read Also: David Warner: రాజేంద్ర ప్రసాద్ దొంగ ముం* కొడుకు కామెంట్స్.. డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే?

మొదటి రోజు భూముల వ్యవహారాలు, భూ సర్వేపై సీపీఎల్‌ఏ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. ఇప్పటికే రాష్ట్రంలో గ‌త 5ఏళ్ల అనేక అక్రమాలు జ‌రిగాయని భావించిన ప్రభుత్వం.. భూ అక్రమాలు చోటు చేసుకున్న జిల్లాలలో జిల్లా ఇంచార్జ్ మంత్రులు నుండి నివేదిక‌ల‌ను గ‌త స‌మావేశంలో కోరారు.. ఈ స‌మావేశంలో వాటిపైన చ‌ర్చిం చ‌నున్నారు.. వీటితో పాటు నగర వనాలు, పచ్చదనం, ఎకో టూరిజంవంటి అంశాల‌పై అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేష‌న్ ఇవ్వనున్నారు.. సంక్షేమ పథకాల అమ‌లుపై ఆయా శాఖల కార్యదర్శుల ప్రజెంటేష‌న్ ఇవ్వనున్నారు.. పీ4 కార్యక్రమంపై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి వివ‌రించ‌నున్నారు..

Read Also: David Warner : నితిన్ కంటే వార్నర్ ను ఎక్కువ హైలెట్ చేస్తున్నారా..?

ఇక, వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. మరోవైపు, సీఎం చంద్రబాబు కీల‌కంగా భావిస్తున్న పీఎం. సూర్య ఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో పది వేల రూఫ్-టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ప్రణాళిక పై ఇంధన శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే విజ‌యానంద్ ప్రజెంటేష‌ణ్ ఇవ్వనున్నారు. తన తొమ్మిది నెలల పరిపాలన తీరుతెన్నులపై ప్రజాభిప్రాయాన్ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరించనున్నారు. రెండో రోజు సాయంత్రం 5 గంట‌ల త‌రువాత‌ గంట సేపు శాంతిభద్రతల పై చర్చించ‌నున్నారు. సీఎం ముగింపు ఉప‌న్యాసం చేయ‌నున్నారు.. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెడుతోంది.. గంజాయి.. మాదక ద్రవ్యాలు.. డ్రగ్స్ ఇలాంటి వాటి విషయంలో సీరియస్ యాక్షన్ ఉండాలని ఎస్పీలకి సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు…