CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్‌గా బతకాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, వారు రైట్ రాయల్‌గా బతకాలని అన్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల శిక్షణా తరగతులకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేకంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమం నిర్వహించి పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆ అవకాశాన్ని పార్టీ కేడర్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మంచి చేస్తే వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, వారు రైట్ రాయల్‌గా బతకాలని అన్నారు. పార్టీ కూడా కార్యకర్తలకు అదే స్థాయిలో గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు.
Read Also: PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
రాష్ట్ర అభివృద్ధి సుదీర్ఘ కాలం స్థిరమైన పాలనతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. తనను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలను మాత్రం కాపాడుకున్నానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ప్రస్తుతం తాము చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని, ప్రభుత్వ పథకాల అమలుకు పడుతున్న కష్టాన్ని తెలియజేయాలని అన్నారు చంద్రబాబు..
వైసీపీని ఉద్దేశిస్తూ ‘కిల్లర్ పార్టీ’, ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శించారు టీడీపీ అధినేత.. ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసి తగిన కౌంటర్ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారని ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎన్నికల వరకు వాడుకున్నారని, అధికారంలోకి వచ్చాక న్యాయం కోరిన సునీతారెడ్డిని బెదిరించారని విమర్శించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని, ఇలాంటి రాజకీయ శైలి తన జీవితంలో చూడలేదని చంద్రబాబు అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును కూడా ప్రస్తావిస్తూ, నేరాలకు పాల్పడి తరువాత ఆరోపణలు ఇతరులపై నెడుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలకు నిరంతరం వివరించాలని, పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను చాటాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!