NTV Telugu Site icon

CM Chandrababu: ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టి పెట్టాలి..

Babu

Babu

CM Chandrababu: ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పని చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ది పై సచివాయలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత పభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని.. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని సీఎం అన్నారు.

Read Also: AP Excise Department: ఈ నెల 11న లాటరీ ద్వారా వైన్ షాప్స్ కేటాయిస్తాం..

కాగా, నేడు ప్రతిశాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని.. వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు.. ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని.. ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమని చెప్పుకొచ్చారు. 2014 తరువాత విభజన కష్టాలు ఉన్నా.. నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం గ్రోత్ రేట్ సాధించిందన్నారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 2019లో తెలంగాణతో పోల్చితే ఏపీ జీఎస్డీపీలో వ్యత్యాసం కేవలం 0.20 శాతం ఉండేది.. ఆ వ్యత్యాసం 2024కు 1.5 శాతానికి పెరిగిందన్నారు. 2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం రూ.93,903 ఉండగా.. 2019 నాటికి రూ.1,54,031 పెరిగిందని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: Beauty Tips: బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి

అలాగే, తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21 శాతం ఉండగా.. గత ప్రభుత్వంలో అది 9.06 శాతం మాత్రమే నమోదు అయిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి పడిపోయి.. ప్రజల జీవన ప్రమణాలు దెబ్బతిన్నాయన్నారు. నాడు తెలంగాణకు ఏపీ మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం కేవ‌లం 0.16 శాతం మాత్రమే ఉంటే.. గత ప్రభుత్వంలో అది 1.84 శాతానికి పెరిగింది.. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉంది.. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసుకుని నిర్ధిష్ట లక్ష్యాలతో పని చేయాలన్నారు. కొన్ని శాఖలు బాగా వెనకబడి ఉన్నాయి.. వారు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది.. త్వరలో ఈ మూడు రంగాల్లో లక్ష్యాలపై ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనవరిలో P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నాం.. ఈ విధానంతో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందని పైకి తెసుకువచ్చేందుకు సహాయం చేయాలని చంద్రబాబు అన్నారు.