NTV Telugu Site icon

CM Chandrababu: ఏపీ అప్పు రూ.9.74 వేల కోట్లు.. తలసరి అప్పు రూ.1.44 లక్షలు..

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పు నేటి వరకు 9 లక్షల 74 వేల కోట్ల రూపాయలు అయ్యింది.. దీంతో తలసరి అప్పు లక్షా 44 వేల 336 రూపాయలకు చేరిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్ధిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీ ముందు ఉంచిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల 6 శ్వేత పత్రాల ద్వారా ప్రజలకు అన్ని విషయాలు తెలియజేశాం. ఈ రాష్ట్రం ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో ఉందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.. విభజన జరిగినప్పడు అశాస్త్రీయ, అన్యాయమైన రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు పెన్షన్లు కూడా ఇవ్వగలమా అని భావించారు. రాజధాని హైదరాబాద్ గా అభివృద్ది చెందడం అది తెలంగాణకు వెళ్లడంతో ఇబ్బందులు వచ్చాయి. సమైఖ్యాంద్ర ప్రదేశ్ లో ఆదాయంలో వాటా 46 శాతం అయితే.. జనాభా 58 శాతం వచ్చాయి. అన్ని కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయి. కానీ, 2014-19 మధ్య కాలంలో అనేక ఎయిర్ పోర్టులను తీసుకువచ్చాం. 4386 కిలో మీటర్లు రోడ్లు తీసుకువచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎక్కవ కాలం నెంబర్ 1లో ఉన్నాము.. అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చాం. అయిదారు నెలల్లోనే మిగులు కరెంటుకు తెచ్చాం. రూ. 200 పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి ఇప్పడు దాన్ని రూ. 4 వేలు చేశాం.. 43 శాతం ఫిట్మెంట్ ఉద్యోగులకు తెలంగాణతో సమానంగా ఇచ్చాం అని వివరించారు.

Read Also: Sundar pichai: డాక్టరేట్ పట్టా అందుకున్న గూగుల్ సీఈవో

ఇక, ఐదేళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదు. గోదావరి ఉన్నంత వరకూ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు.. అయితే ఆ పరిస్ధితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు అన్నారు సీఎం చంద్రబాబు.. పోలవరం రూ. 15364 కోట్లు ఖర్చు చేశాం. అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈ పాటికే ప్రాజెక్టు ఆపరేషన్‌లో ఉండేది అన్నారు.. కేంద్రం వేసిన ఎక్స్‌ఫర్ట్ కమీటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్యారలల్ గా కొత్త డయాఫ్రాం వాల్ నిర్మించాలని అత్యవసర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. దీంతో రూ. 990 కోట్లు దీని కోసం ఖర్చే చేయాల్సి వస్తోందన్నారు.. న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ అమారావతి. కొత్త నగరాలు ఆవశ్యకత ఎంతో అవసరం ఉంది.. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇండియాలోని హైదరాబాద్ మాత్రమే అని అందరూ గుర్తించారు.. అమరావతి నిర్మాణం పూర్తై ఉంటే 7 లక్షల మంది ఉద్యోగులు అమరావతిలో ఉండేవారు. 3 నుంచి నాలుగు లక్షల కోట్ల ఆస్తి అమరావతితో వచ్చేదన్నారు.

Read Also: HMD Crest: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లతో ఫోన్స్‭ను విడుదల చేసిన ఎచ్ఎండి..

తలసరి ఆదాయం 13. 2 శాతం 2014-19 మధ్య పెరిగిందని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇప్పడు చాలా అధ్వాన్నమైన పరిస్ధితికి వచ్చాం. 5.7 శాతం వ్యవసాయ గ్రోత్ రేట్ ఐదేళ్లల్లో తగ్గిపోయింది. సర్వీస్ సెక్టార్ సుమారు 2 శాతం తగ్గింది. గ్రోత్ రేట్ 3 శాతం తగ్గిపోయింది. పవర్ సెక్టార్లోనే లక్షా 29 వేల కోట్లు అప్పులు చెల్లించాల్సిన పరిస్ధితి వీరి నిర్వాకం వల్ల వచ్చింది.. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు ఉపయోగిచుకోకుండా ఉండడంతో నిధులు నిలిచిపోయాయి. వరుసగా విద్యుత్, ఆర్టీసీ, టాక్స్‌లు, ఇసుక, చెత్తపన్నులు కూడా వేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటి వరకూ 9 లక్షల 74 వేల కోట్లు అప్పు అయ్యింది.. ఇది నేటికి ఉన్న రాష్ట్ర అప్పు అని వివరించిన ఆయన.. దీంతో తలసరి అప్పు లక్షా 44 వేల 336 రూపాయలకు చేరిందన్నారు. ఇది టీడీపీ హయాంలో 74,790 ఉండేది. కానీ, వైసీపీ పాలనలో ఆ అప్పు కాస్తా డబుల్ అయ్యిందన్నారు.. మద్యపాన నిషేధం అని చెప్పి చివరకు భవిష్యత్తు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. 33 సంస్ధల నుండి డబ్బులను సైతం లాగేశారు తద్వారా ఖర్చు పెట్టేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నుండి రూ. 400 కోట్లు తీసేసుకున్నారు. విశాఖలో అనేక ఆఫీసులను తాక్టు పెట్టేశారు . రూ. 40 వేల కోట్ల ఆస్తులను వీరు విశాఖలో కబ్జా పెట్టారు. అభయహస్తం కింద డ్వాక్రా మహిళల డబ్బులను కూడా కొట్టేశారు అంటూ విమర్శలు గుప్పించారు..

Read Also: Tamil Nadu: బస్ డ్రైవర్కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని రక్షించి ప్రాణాలు వదిలిన డ్రైవర్

మనం ప్రజలకు హమీలు ఇచ్చాం.. కేంద్రం ముందుకు వచ్చి ఒక పేరా బడ్జెట్లో పెట్టారు. అమరావతిని ముందుకు తీసుకువెళ్ళాలి, పోలవరాన్ని తొందరలో పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు సీఎం చంద్రబాబు.. వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తున్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కు డబ్బులేవని చెప్పాం.. అవి కూడా ఇస్తారు. ఇచ్చిన హమీల్లో దేని విషయంలోనూ వెనక్కి తగ్గదే లేదు. ఇప్పటికే పెన్షన్లు అమలు చేస్తున్నాం. అన్నా క్యాంటిన్లు ఆగష్టు 15న కనీసం 100 సెంటర్లు ప్రారంభిస్తాం. ఫ్రీ శాండ్ కూడా అందుబాటులోకి తెచ్చాం. కేంద్రం నుండి మనకు సపోర్టు రావాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్‌ కు రాష్ట్రానికి ఏదో చేయాలనే పట్టుదల ఉంది. బీజేపీ మద్దతు ఉంది రోటీనుగా కాకుండా భిన్నంగా అడ్మినిష్ట్రేషన్ ఉండాలి. గ్రామాలు, మండలం, జిల్లా హెడ్ క్వర్టర్, అక్కడి నుండి ఎయిర్ పోర్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి కొందరికి వెసులు బాటు ఇచ్చి కట్టగలిగిన వారి నుంచి కట్టించుకోవాలి.. ప్రతి పైసా ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలను ఎలా పెంచగలమో ఆలోచించాలి. వినూత్నమైన పాలసీ ద్వారా సూపర్ సిక్స్ అమలు చేయాలి. మరో రెండు నెలల్లో బడ్జెట్‌తో ముందుకు వస్తాం అన్నారు.. తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేయలేదు. కాస్తో కూస్తో అభివృద్దికి దోహదం చేశారన్నారు. ఇచ్చిన ప్రతి హమీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

Read Also: Blue Light: మీ ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మీ చర్మానికి హాని కలిగిస్తుంది..

ఇక, బిల్లుల చెల్లింపు సరిగా జరగలేదన్నారు సీఎం చంద్రబాబు.. రూ. 1, 35, 224 కోట్లు మేర పెండింగ్ బిల్లులు ఉన్నాయి. రాష్ట్రాన్ని డెట్ ట్రాప్ లోకి తీసుకువెళ్లిపోయారు. తిరిగి ఇస్తారనే నమ్మకం ఉంటే వడ్డీ తక్కవకు ఇస్తారు. ఆస్తులు తాకట్టు పెట్టారు… సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం డబ్బులను తీసుకొని మన వాటా ఇవ్వలేదు.. దీంతో బ్లాక్ లిస్టులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ రోజుకు ఆలోచిస్తే ప్రతి 100 రూపాయలు ఆదాయం వస్తే 113 రూపాయలు ఖర్చులు ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరం డెఫిసిట్ చూస్తే లక్షా 46 వే 909 కోట్లు ఉంది. ఒక్క పోలవరం మిస్ మ్యానేజ్మెంట్ వల్ల రూ. 53 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. ప్రజా వేదిక ప్రజలకు ఉపయోగపడేదాన్ని కూల్చేశారు. విశాఖలో రుషికోండలో రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు ఆ రిషికొండ ప్యాలెస్, ప్రజావేదికను ఏం చేయాలో చెప్పాలి..? అని ప్రశ్నించారు. టూరిజంకు ఈ అయిదు వందల కోట్లు ఖర్చు చేస్తే ఎన్నో వేలమంది టూరిస్టులు వచ్చే వారు.. ఆదాయం వచ్చేదన్నారు.