Site icon NTV Telugu

CM Chandrababu: కొత్త కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌.. కీలక సూచనలు

Cbn

Cbn

CM Chandrababu: కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు చంద్రబాబు.. సీఎం అంటే కామన్ మెన్‌ అని నేను చెబుతున్నా.. మీరు కూడా అలాగే పని చేయాలని సూచించారు.. ప్రతి పనికి దానికీ డబ్బులు లేవని చెప్పద్దు.. కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఉపయోగించుకోవాలి.. అన్నింటికీ రూల్స్ అనొద్దన్నారు.. మానవీయ కోణంలో పని చేయండని సూచించారు చంద్రబాబు.. కలెక్టర్ గా పని చేయడం అంటే మీకు మంచి గుర్తింపు వస్తుందన్న ఆయన.. జిల్లా కలెక్టర్ల ఎంపికలో నాకున్న బెస్ట్ ఆప్షన్లలో మిమ్మల్ని ఎంపిక చేశానని వెల్లడించారు.

Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం..

నాలుగో సారి సీఎంగా ఉన్నా నా టీమ్ మీరే అన్నారు చంద్రబాబు.. పని చేసే వారిని ప్రోత్సహిస్తా.. లేకపోతే మిమ్మలిని కొనసాగించను స్పష్టం చేశారు.. ఇతర జిల్లాల కలెక్టర్లతో పోటీ పడండి. మీ నిర్ణయాలు క్రియేటివ్ గా.. ఇన్నోవేటివ్ గా ఉండాలి.. సోషల్ మీడియా.. మీడియాలో దుష్ప్రచారం పై ఫస్ట్ అవర్‌లోనే రియాక్ట్ కావాలని స్పష్టం చేశారు. ఇక, కలెక్టర్ అంటే అహంకారం, ఇగోలు వద్దు అని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Sajjala Ramakrishna Reddy: ఇదే మనకు మంచి అవకాశం.. ఏ మాత్రం జాప్యం తగదు..

కాగా, రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది ప్రభుత్వం.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి.. విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరు.. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతిక శుక్లా, బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్‌కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్‌కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సిరి, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యాంప్రసాద్‌ను నియమించింది ప్రభుత్వం..

Exit mobile version