NTV Telugu Site icon

CM Chandrababu Naidu: పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు.. సీఎం సమీక్ష..

Cbn

Cbn

CM Chandrababu Naidu: పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు.. కాగా, ఏపీ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు ఏపీ సర్కార్ సాంకేతికను వినియోగిస్తుంది. అలాగే ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, గత ప్రభుత్వ హయాంలో రైతుల దగ్గర ధాన్యం కొని, నెలల తరబడి డబ్బులు చెల్లించలేదన్న విమర్శల నేపథ్యంలో.. ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన కూటమి ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై దృష్టిసారించింది..

Read Also: CM Revanth Reddy: కేసీఆర్‌… అసెంబ్లీ సమావేశాలకు రండి, సలహాలు ఇవ్వండి..

ఇక, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు ధాన్యం విక్రయించుకొనే విధానాన్ని ప్రభుత్వం సులభతరం చేస్తూ కీలక మార్పులు తీసుకువచ్చింది. రైతులు తమ పంటను జిల్లాలో ఎక్కడైనా, ఏ రైస్ మిల్లుకైనా అమ్ముకొనే విధానాన్ని అమలుచేస్తుంది. అదే విధంగా వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసేందుకు సులభ విధానం అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు.. ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 61 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక, చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు మంత్రి మనోహర్‌.. సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్.. ఈ రోజు రాత్రికి సీఎం విశాఖపట్నం వెళ్లనున్న విషయం విదితమే..

Show comments