Cyclone Montha: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని ఓడలరేవు గ్రామంలో తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించిన సీఎం చంద్రబాబు.. పునరవాస కేంద్రాలలో ప్రజలతో మాట్లాడారు.. ప్రజలకు నిత్యవసరాలతో పాటు బియ్యం కూడా అందజేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు… అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రాణనష్టం జరగకుండా అర్ధరాత్రి వరకు మానిటర్ చేశాం.. వరి పంట కొంతవరకు దెబ్బతింది.. హార్టికల్చర్ కొంతవరకు దెబ్బతింది.. మరికొన్ని జిల్లాల్లో ఈరోజు కూడా తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి… ఒక్కోచోట ఒక్కో విధంగా తుఫాను ప్రభావితం ఉండడంతో పూర్తిగా అంచనా వేయడానికి కాస్త సమయం పడుతుందన్నారు.. అయితే, రెండు నుంచి మూడు రోజులు రిహాబిడేషన్ సెంటర్స్ లో ఉన్నవారికి 3000 రూపాయలతో పాటు నిత్యవసరాలు, బియ్యం అలాగే మత్స్యకారులు వేట నిషేధం విధించాం కాబట్టి 50 కేజీల బియ్యం.. అలాగే చేనేతలకు కూడా బియ్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.. పునరావాస శిబిరాలలో ఉన్నవారికి తక్షణ ఆర్థిక సాయం కింద మనిషికి వెయ్యి రూపాయల నగదు చొప్పున.. కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేల చొప్పున అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Montha Cyclone : ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సరిహద్దుల్లో తుఫాన్ కేంద్రీకృతం
ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు సీఎం చంద్రబాబు.. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఓడలరేవులోని తుఫాన్ పునరవాసి కేంద్రాలను పరిశీలించారు.. తుఫాన్ బాధితులను పరామర్శించారు.. రోడ్డు మార్గం ద్వారా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చేరుకున్న చంద్రబాబు.. తుఫాన్ కు నేలకొరిగిన వరి పొలాలు పరిశీలించారు.. పంట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు.. వరి పైరు నేలకొరిగి పోవడంతో దిగుబడి తగ్గిపోతుందని ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు రైతులు.. ఎకరానికి 20 నుండి 30 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతులు సీఎం చంద్రబాబు ఎదుట వాపోయారు..
