CM Chandrababu: కూటమి శాసన సభాపక్ష సమావేశం ముగిసింది.. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసన సభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 150 రోజుల పాలనలో చేసిన అన్ని అంశాలపై చర్చ సాగింది.. మంత్రులు.. ఎమ్మెల్యేలకు అన్ని విషయాలలో సహకరించాలని సూచించారు.. ఎమ్మెల్యేలు అందరూ హుందాగా ఉండటం అలవాటు చేసుకోవాలన్న ఆయన.. ప్రతిపక్షం లేదని నిర్లక్ష్య ధోరణి వద్దు అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు.. మరింత జోరుగా ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని దిశా నిర్దేశం చేశారు.. పాలసీలు అన్నీ క్షేత్రస్ధాయిలో అమలయ్యేలా ఎమ్మెల్యేలు చూడాలన్నారు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యాటక అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు.. ఎమ్మెల్యేలు ప్రతీ సమస్యనూ కచ్చితంగా చర్చించాలన్న సీఎం.. ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీలో సమస్యలపై చర్చ జరగాలన్నారు.
Read Also: AI Adoption: ప్రపంచంతో పోలిస్తే, AIని తెగవాడుతున్న ఇండియా….
ఇక, ఇసుక విషయంలో అక్రమాలు జరగకూడదు.. ఇసుక పాలసీ అమలు విషయంలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, అంతకు ముందు అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎమ్మెల్యేల అవగాహన సదస్సులోనూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం.. ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని.. ఇది మంచిది కాదని… నిరంతరం నేర్చుకోవాలి… తెలుసుకోవాలని హితవు చెప్పారు.. ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నాను అన్నారు.. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు… కానీ మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో… ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు అని సూచించారు.. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరని.. గతంలో అదే జరిగిందని హెచ్చరించారు.. శాఖల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..