AP Secretariat: సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఘటనా స్థలానికి సీఎం.. చెత్తపై సీరియస్..
- ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదం..
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..
- అగ్నిప్రమాదంపై ఆరా.. కీలక ఆదేశాలు..
- అపరిశుభ్రతపై అసంతృప్తి.. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Secretariat: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు.. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది.. లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా? లేదా? అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం, 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Raghuveera Reddy: మూడు ‘సీ’లు కలిస్తే దేశం సుభిక్షం..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!