NTV Telugu Site icon

CM Chandrababu Delhi Tour: మరోసారి ఢిల్లీ బాట.. నేడు హస్తినకు సీఎం చంద్రబాబు

Babu 2

Babu 2

CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. ఈ రోజు.. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకోనున్నారు చంద్రబాబు.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. రేపు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోరినట్టుగా తెలుస్తుండగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ చంద్రబాబు సమావేశం అవుతారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.. పోలవరం ప్రాజెక్టు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.. మరోవైపు.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్‌ చేయాల్సిందిగా కోరనున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల కీలక సూచనలు.. డిజైన్‌ మార్పులతో..!

మరోవైపు.. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి.. పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్‌ పెట్టారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.. గతంలో వెనక్కి వెళ్లిన సంస్థలను మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్నారు టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్. ఉదయం 10.30 గంటలకు టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సమావేశం జరగనుంది.. అనంతరం సీఎంతో భేటీకానున్నారు CII ప్రతినిధుల బృందం. CII డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీకానున్నారు సీఐఐ ప్రతినిధులు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.