NTV Telugu Site icon

CM Chandrababu: 3 పార్టీలు.. 3 రకాల స్వభావాలు.. కానీ ఒకటే ఆలోచన.. ఇది శాశ్వతంగా ఉండాలి..!

Babu

Babu

CM Chandrababu: మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. కానీ, ఒకటే ఆలోచన.. ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ మాట్లాడుతుంటే గతం గుర్తొస్తోంది. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులుండేవి. పవన్ ఏపీకి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే.. రోడ్డు మార్గంలో వచ్చారు. రోడ్ మార్గంలో కూడా పవన్‌ను రానివ్వలేదు. కానీ, పవన్ కల్యాణ్‌ రోడ్డు మీదే పడుకున్నారు. సాధారణంగా సినిమావాళ్లు ఇదంతా చేయరు.. కానీ, పవన్ పట్టుదలతో ప్రజాస్వామ్యం కోసం కష్టపడి పని చేశారని అభినందించారు చంద్రబాబు నాయుడు.. జైల్లో ఉన్న నన్ను పరామర్శించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా పొత్తు గురించి ప్రకటన చేసిన వ్యక్తి పవన్.. బీజేపీతో పొత్తులో ఉన్నా.. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీజేపీని కూడా ఒప్పిస్తానని చెప్పారు పవన్ కల్యాణ్‌.. నాది, పవన్‌ది ఒకే ఆలోచన. ప్రజలు గెలవాలి.. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేయాలనేదే మా ఇద్దరి ఆలోచనగా స్పష్టం చేశారు.

Read Also: Diamond Business: వజ్రాల వ్యాపారంలో భారీ సంక్షోభం.. దేశవ్యాప్తంగా 60 మంది ఆత్మహత్య!

సీట్ల విషయంలో కూడా ఏ చిన్న గ్యాప్ లేకుండా పని చేశాం. పురందేశ్వరి కూడా పొత్తు గురించి కృషి చేశారన్నారు చంద్రబాబు.. వేరే వారు బీజేపీ అధ్యక్షునిగా ఉంటే ఏమయ్యేదో తెలీదు కానీ.. పురందేశ్వరి ఉన్నారు కాబట్టి పొత్తు సాధ్యమైందని పేర్కొన్నారు.. ముగ్గురు కలిసి పోటీ చేస్తే రాష్ట్రానికి పునర్ వైభవం తేవచ్చని భావించాం. పొత్తు వల్ల నష్టం వస్తుందేమోననే అనుమానాల్ని కొందరు వ్యక్తం చేశారు.. కాదు లాభమని మేం ఇద్దరం నమ్మాం.. అదే నిజమైందన్నారు.. కేంద్రం సహకరించకుంటే.. కేంద్రంలో మన అనుకున్న ప్రభుత్వం లేకుంటే ఏపీని కాపాడుకోవడం కష్టమయ్యేదన్నారు.. మేం ప్రతిపక్షంలో ఉండగా.. ఎన్నో విమర్శలు చేశాం. కానీ, అధికారంలోకి వచ్చాక చూస్తే.. గత పాలకులు ప్రభుత్వాన్ని నడిపిన తీరు చూసి చాలా ఆశ్చర్యమేస్తోంది. ఇంతటి దారుణంగా వ్యవహరిస్తారా..? అని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు..

Read Also: Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ కోరికే తప్ప.. వ్యూహాలు లేవు..!

రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా 93 శాతం స్ట్రైక్ రేట్.. 52 శాతం ఓటింగ్ ఎప్పుడూ లేదు. ఎప్పుడూ రానటువంటి విజయం 2024 ఎన్నికల్లో వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు.. మూడు పార్టీలు అనుసరించిన విధానం.. ఏ చిన్నపొరపాటు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పనులు చేయడం ఎంత ముఖ్యమో.. ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజామోదం ఉండాలంటే వారు మెచ్చుకునేలా పని చేయాలి.. మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.. మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. కానీ ఒకటే ఆలోచనగా స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్పాలి.. కేంద్ర పథకాల అనుసంధానం గురించి చెప్పాలన్నారు.. వికసిత్ భారత్, జల్ జీవన్ మిషన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాల అద్భుతంగా ఉన్నాయి. కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ఏపీలో ప్రతి ఇంటికి కుళాయి నీరందిస్తాం అన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు పక్కదారి పట్టించింది గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిధులను ఇచ్చాం. ఒకే రోజున గ్రామసభలు పెట్టే అద్భుతమైన ఆలోచన పవన్ కల్యాణ్‌ది అన్నారు. ఇలాంటి వండర్ ఫుల్ ఆలోచన పవనుకు ఎలా వచ్చిందో అనుకున్నా. ఒకే రోజున గ్రామసభలు నిర్వహణపై గిన్నిస్ బుక్ రికార్డు నమోదు అయిందన్నారు..

Read Also: Nitin Gadkari: రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుకు రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్?.. కేంద్ర మంత్రి వివరణ..

ఏపీలో పెద్ద ఎత్తున రైల్వే లైన్లు వేస్తున్నారు అని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. విశాఖ రైల్వే జోన్ కోసం గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా అడ్డం పడిందని విమర్శించారు.. త్వరలోనే విశాఖ రైల్వేై జోన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని కేంద్రం ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీలో ఇండియా గేమ్ ఛేంజర్ కాబోతోంది. పీఎం సూర్య ఘర్ ద్వారా గ్రీన్ ఎనర్జీ రివల్యూషన్ రాబోతోంది. దీన్నో ఉద్యమ స్ఫూర్తితో చేయబోతున్నాం. ఒకప్పుడు ఇళ్లకు.. పంటలకు కరెంట్ లేని పరిస్థితి.. కానీ, ఇప్పుడు ఇళ్ల మీద కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ 72 గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కేంద్రంలోని కార్యక్రమాలను అధ్యయనం చేసుకోవడం.. వాటిని అనుసంధానం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు.