మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. కానీ, ఒకటే ఆలోచన.. ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే గతం గుర్తొస్తోంది. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులుండేవి. పవన్ ఏపీకి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే.. రోడ్డు మార్గంలో వచ్చారు. రోడ్ మార్గంలో కూడా పవన్‌ను రానివ్వలేదు.
ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో కూటమి గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని నేను ప్రకటన వెనుక రాష్ట్రం బాగుండాలనే కోరికే తప్ప.. వ్యూహాలు లేవు అని వ్యాఖ్యానించారు.. అయితే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండడానికి ఎంతో కష్టపడ్డాం అన్నారు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే బలమైన ఆకాంక్షే.. అద్భుత విజయాన్ని తెచ్చి పెట్టింది. అందరి సమిష్టి కృషితో అద్భుత విజయం సాధ్యమైందన్నారు..…