CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై ఉన్నతాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించిన సీఎం, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ అధికారులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 31 కొత్త పోస్టులను మంజూరు చేసినట్లు సీఎం గుర్తు చేశారు. త్వరలోనే మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోపు సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక సిబ్బంది నియామకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇక, డీఎస్సీ నియామకాల అంశంపై వైసీపీ చేస్తున్న విమర్శలను మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు… ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే వాస్తవాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ విమర్శలు చేస్తోందని, వాటికి సమర్థవంతంగా కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రులకు సూచించినట్లు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ వరకు రెండు వారాల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంత్రులు ఏ జిల్లాలో ఉన్నా ప్రభుత్వ పథకాల ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
తాజావార్తలు
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
-
New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
-
Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?