Kakinada Ration Rice Case: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 2024 డిసెంబర్ 6న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.. గతేడాది జూన్ జూలై నెలల్లో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఐదు పోలీస్ స్టేషన్ లలో 13 రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి .. ఈ కేసుల్లో 84.87 కోట్లు విలువైన 22 వేల 947 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. సిట్ చీఫ్ గా వినీత్ బ్రీజిలాల్ ను నియమించారు.. ఏమైందో ఏమో సడన్ గా ఆయన కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్ళిపోయారు.. దాంతో మే 7న కొత్త బాస్ గా ఐపీఎస్ అధికారి రవికృష్ణ ను ప్రభుత్వం నియమించింది.. సిట్ బృందంలో కూడా మార్పులు చేర్పులు చేశారు.. సిఐడి ఎస్పి ఉమామహేశ్వర్, కాకినాడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, కర్నూలు ఐసిడిఎస్ ఆర్జెడి రోహిణి, విజయనగరం డిఎస్ఓ మధుసూదన్ రావు, కోనసీమ సివిల్ సప్లై మేనేజర్ బాల సరస్వతిని విచారణ చేయాలని ఆదేశించింది.. కానీ, మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది.. సిట్ బృందం ఒక సమావేశం కూడా అవలేదు.. కనీసం గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సిట్ చీఫ్, అందులో సభ్యులను నాలుగు సార్లు మార్చారు… కొందరు అధికారులు గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారని వారిని పక్కన పెట్టారు.. కానీ, అసలు ఉద్దేశం మాత్రం ముందుకు సాగలేదు.. అసలు కేసు ఎక్కడ వరకు వచ్చిందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది.
Read Also: Deputy cm pawan kalyan : గెలిస్తే ఒక న్యాయం ఓడిపోతే ఇంకో న్యాయమా !
రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారా గత ప్రభుత్వంలో ముఖ్య నేతలకి భాగస్వామ్యం ఉందని కూటమి ప్రభుత్వంలో మంత్రులు క్లారిటీగా చెప్పారు.. సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా కాకినాడ పోర్టు రైస్ మిల్లులను పరిశీలించారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫ్రికా దేశాలకు వెళ్తున్న రేషన్ రైస్ సీజ్ చేయాలని సముద్రంలోకి వెళ్లి ఆదేశాలు ఇచ్చారు.. కానీ, ఆ కేసు మాత్రం అలా హోల్డ్ లో పడిపోయింది.. దాని పై విమర్శలు కూడా వచ్చాయి ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకున్నప్పటికీ ఎందుకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న కామెంట్లు వినిపించాయి..
Read Also: Pakistan Helicopter Crash: పాక్‌లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్
మద్యం కుంభకోణం పై ఒకవైపు సిట్ దూకుడు గా వ్యవహరిస్తుంటే, రేషన్ రైస్ పై మాత్రం సీరియస్ గా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.. దాంతో మరోసారి జీవో సవరణ చేసింది ప్రభుత్వం.. సిఐడి నుంచి నలుగురు అధికారులను సిట్ బృందంలో భాగస్వాములుగా చేశారు.. మరో 10 మంది అధికారులు అడిషనల్ గా నియమించారు.. సీజ్ చేసిన బియ్యం పాడైపోతున్నాయని రైస్ మిల్లు యజమానులు కోర్టును ఆశ్రయించడంతో బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని బియ్యాన్ని ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది… రేషన్ బియ్యం ఎవరు కొన్నారు ?ఎవరికి తరలించారు? ఎవరికి విక్రయించారు అనే విషయాలపై సిట్ క్లారిటీ ఇవ్వనుంది.. దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది .. అవసరమైతే అనుమానం ఉన్న వాళ్ళని విచారణ చేయడానికి కూడా సిద్ధమవుతుంది సిట్ బృందం..
