Site icon NTV Telugu

CM Chandrababu: సోషల్‌ మీడియాలో పోస్టులపై సీఎం సీరియస్‌.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు..

Chandrababu

Chandrababu

CM Chandrababu: సోషల్‌ మీడియాలో పోస్టులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు.. సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయి అంటూ మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు.. ఆడబిడ్డ హోంమంత్రి పైన పోస్ట్ లు పెడుతున్నారు.. ఆంబోతులు మదిరిగా మారారు… మదమెక్కి వ్యవహరిస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. చివరకు పవన్ కల్యాణ్‌ కుమార్తెల మీద పోస్టింగ్ లు పెడితే.. వారు బాధపడుతున్నా పరిస్థితి తెచ్చారు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా..? వద్దా? అని ప్రశ్నించారు.. అయితే, అలాంటి వారిపై చర్యలు సబబే అంటూ సమాధానం ఇచ్చారు ప్రజలు..

Read Also: Shah Rukh Khan: నెక్ట్స్ చంపేది షారుఖ్‌ ఖాన్‌నే అంటూ బెదిరింపులు..

ఇక, గతంలో వైఎస్‌ వివేకాను హత్య చేసి గుండెపోటు అంటే మొదట నేనుకూడా నమ్మాను.. పోస్ట్ మార్టం చేశాక చూస్తే భయంకరంగా చేసిన హత్య అని తేలింది అని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు.. తర్వాత ఆ హత్యను నా మీద నెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. అత్యాచారాలు చేస్తున్న వారిని ఏమి చేయాలని ఆలోచిస్తున్నాం అన్నారు.. పోలీసులు ఒక సారి ఆలోచించు కోవాలి.. పోలీసులు అప్పర్ హ్యాండ్‌తో ఉండాలి.. నేరస్తులది అప్పర్ హ్యాండ్ వుంటే మంచిది కాదని హితవు చెప్పారు.. వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారు.. రాజకీయాలు రాజకీయంగా చేస్తే సరే.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించను అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. ఇప్పుడు ఈ అంశాలు చెప్పక పోతే నేను డిఫాల్టర్ గా మరుతాను.. అందుకే ఇప్పుడు చెప్పక తప్పలేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version