CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించాలంటే నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. రూ.1,000, రూ.2,000 నోట్లతో పాటు రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలని సూచించారు. దేశంలో రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. నోట్ల రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాను డిమాండ్ చేస్తూనే ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీ ఆలోచన తనదేనని, దీని ద్వారా అవినీతికి చెక్ పెట్టవచ్చని అన్నారు.
పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ కీలకం
టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటే సంపద సృష్టి సాధ్యమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటే అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. పేదరిక నిర్మూలనకు సాంకేతిక పరిజ్ఞానం కీలకమని, ఆర్థిక వనరులను ప్రజలకు మెరుగైన అవకాశాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఇక, యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్-2026లో ఆంధ్రప్రదేశ్ రెండో ర్యాంకు సాధించింది. న్యూ ఎకనామిక్ స్టడీస్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ సూచీలో 0.66 స్కోరుతో ఏపీ రెండో స్థానంలో నిలవగా, 0.68 స్కోరుతో గోవా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేరళ 0.60, సిక్కిం 0.63 స్కోర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తమిళనాడు, తెలంగాణ 0.57 స్కోరు సాధించాయి. రాష్ట్రాల సామాజిక, ఆర్థిక సమానత్వం, ప్రజలకు అందుతున్న అవకాశాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, గృహవసతి, స్వచ్ఛ ఇంధనం, పోషకాహారం వంటి అంశాలను పరిశీలించారు. అలాగే డిజిటల్ సదుపాయాలు, విద్య, పాఠశాలలు, ఉపాధ్యాయులు, వృత్తి విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
Also Read
- CPS to OPS Conversion: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. డెడ్‌లైన్ ఎప్పుడంటే..?
- SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
- Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
- CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ముందంజ
బ్యాంకింగ్, ఉపాధి, బీమా, పింఛన్లు, సామాజిక భద్రతతో పాటు న్యాయ సదుపాయాలు, న్యాయ సహాయం, సకాలంలో న్యాయం అందుబాటులో ఉండటం వంటి అంశాలను కూడా అధ్యయనంలో భాగంగా తీసుకున్నారని తెలిపారు చంద్రబాబు… సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో ఆంధ్రప్రదేశ్ 0.69 స్కోరు సాధించగా, గోవా స్కోరు 0.50గా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఐదు ప్రధాన అంశాల్లోనూ తొలి మూడో వంతు రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించిందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నప్పటికీ, సమానత్వ సూచీలో ముందంజలో ఉండటం విశేషమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వనరులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ విధానమని వివరించారు. ఉచిత ఇసుక వంటి విధానాల ద్వారా రాష్ట్ర వనరుల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక, అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టించడం మాత్రమే కాదని, ఆ సంపదను ప్రజలకు అవకాశాలుగా మార్చడమే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. టెక్నాలజీ, ఆర్థిక వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ పేదరిక నిర్మూలన, సామాజిక సమానత్వం సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
-
Amala Akkineni : సముద్రంలో కొట్టుకుపోయిన అక్కినేని అమల.. ఎలా బతికిందంటే?
-
CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
-
Charminar Temple Rush: చార్మినార్‌లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
-
CBFC : తాజా నిబంధనలతో ఇండస్ట్రీలో కలకలం.. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!