Site icon NTV Telugu

Amaravati: అమరావతిలో భూ కేటాయింపులు.. కేబినెట్‌ సబ్‌ కమిటీ కీలక నిర్ణయాలు..

Minister Narayana

Minister Narayana

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయింది… సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.. సమావేశానికి మంత్రులు నారాయణ, భరత్, అధికారులు హాజరయ్యారు.. వర్చువల్ గా ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. 16 అంశాలకు గాను 12 అంశాలు మంత్రివర్గ ఉప సంఘంలో ఆమోదం జరిగింది అని మంత్రి పొంగూరి నారాయణ వెల్లడించారు.. 2014- 19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలకి కొనసాగిస్తూ ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు..

Read Also: GHMC: లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్

సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్విసిగేషన్ కు రెండు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ ఆమోదం తెలిపినట్టు మంత్రి నారాయణ తెలిపారు.. జుయాలజీకల్ ఆఫ్ సర్వే సంస్థకు రెండు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ.. స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ.. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.. ఇక, 2014- 19లో కేటాయించిన రెండు సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేశాం. గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్బత్తి కి భూ కేటాయింపులు రద్దు చేయగా.. కొత్తగా ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేశాం అన్నారు.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు రెండు ఎకరాలు.. ఏపీ గ్రామీణ బ్యాంక్ కు రెండు ఎకరాలు.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 0.4 ఎకరాలు.. ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB). కి 0.5 ఎకరాలు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు.. బిజెపి పార్టీకి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం.. భూములు కేటాయించిన సంస్థలకు టైమ్ లైన్ ప్రకారం నిర్మాణం చేయాలి. 2014- 2019 కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు ఇచ్చాం. ఈ సంస్థల్లో కొంతమంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మిగిలినవారు ఎవరు నిర్మాణాలకు ముందుకు రాలేదు.. అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోయారని వ్యాఖ్యానించారు.

Read Also: Maharashtra: అమానుషం.. నీట్ మాక్ టెస్ట్‌లో ఫెయిలైందని కర్రతో దాడి.. కుమార్తె మృతి

గత ప్రభుత్వం ఆడిన మూడుముక్కలాటతో అందరూ భయపడ్డారు.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో అనేక మంది భూ కేటాయింపులకు అప్లై చేశారని తెలిపారు మంత్రి నారాయణ.. అందులో 64 సంస్థలకు 884 భూ కేటాయింపులకు చేశాం.. ఈరోజు పది సంస్థలకు భూ కేటాయింపులు చేశాం. గతంలో కేటాయించిన సంస్థలకు టైం బాండ్ ముగిసింది. మంత్రివర్గ ఉప సంఘంలో మరోసారి చర్చకు పెట్టి రివైజ్ చేసుకుంటూ వస్తున్నాం. భూములు కేటాయించిన సంస్థలకు నాలుగు నుంచి ఆరు నెలలు సమయం కేటాయించాం.. భూములు కేటాయించిన సంస్థల వద్ద నుంచి ప్రారంభానికి టైం షెడ్యూల్ తీసుకున్నాం. రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని సంస్థలు నిర్మాణాలు చేపట్టనున్నాయి. కేటాయించిన సమయంలో నిర్మాణాలు చేపట్టకపోతే భూములు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో పిలిచిన అన్ని టెండర్స్ కు పనులు మొదలయ్యాయి.. ప్రస్తుతం 10,000 మంది పైగా కార్మికులు అమరావతిలో పనిచేస్తున్నారు. వచ్చే నెల చివరి నాటికి 20 వేల మంది కార్మికులు పనిచేయటానికి అందుబాటులోకి వస్తారు అని వెల్లడించారు మంత్రి నారాయణ..

Exit mobile version