Site icon NTV Telugu

Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. ఆర్ధిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం..

Botsasatyanarayana

Botsasatyanarayana

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.. ఈ లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తున్నదని ఆయన లేఖలో ఆరోపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల విషయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించడం లేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని, ప్రతి సంవత్సరం అప్పుల భారము అధికమవుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Redmi K90 Max: 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. కూలింగ్ ఫ్యాన్‌తో రెడ్‌మి 5G ఫోన్

అదనంగా, ఆఫ్-బడ్జెట్ అప్పులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయని ఆరోపించారు బొత్స సత్యనారాయణ.. అయితే 2024-25 మరియు 2025-26 సంవత్సరాల్లో కొత్త అప్పులు ఎక్కువగా తీసుకోలేదని ప్రభుత్వం చెబుతున్న విషయాన్ని బొత్స తప్పుబట్టారు. ఇది వాస్తవాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నదని పేర్కొంటూ, ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను బొత్స సత్యనారాయణ కోరారు. ఈ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొత్స లేఖపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది..

Exit mobile version