Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. ఆర్ధిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.. ఈ లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తున్నదని ఆయన లేఖలో ఆరోపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల విషయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించడం లేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని, ప్రతి సంవత్సరం అప్పుల భారము అధికమవుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Redmi K90 Max: 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. కూలింగ్ ఫ్యాన్‌తో రెడ్‌మి 5G ఫోన్
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అదనంగా, ఆఫ్-బడ్జెట్ అప్పులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయని ఆరోపించారు బొత్స సత్యనారాయణ.. అయితే 2024-25 మరియు 2025-26 సంవత్సరాల్లో కొత్త అప్పులు ఎక్కువగా తీసుకోలేదని ప్రభుత్వం చెబుతున్న విషయాన్ని బొత్స తప్పుబట్టారు. ఇది వాస్తవాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నదని పేర్కొంటూ, ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను బొత్స సత్యనారాయణ కోరారు. ఈ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొత్స లేఖపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..