Botsa Satyanarayana: మెడికల్ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.. వారికి సంఘీభావంగా అసెంబ్లీ వద్ద ధర్నా చేపట్టిన ఆ పార్టీ ఎమ్మెల్సీలు.. ఈ సందర్భంగా బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ.. పీపీపీ విధానం అంటే దోపిడీ..! పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..? అని ప్రశ్నించారు.. ప్రజారోగ్యానికి వ్యతిరేకమైన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం.. దోపిడీ, అవినీతి కోసం ఈ విధానాన్ని తీసుకువస్తున్నారు.. ఇప్పటికే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం.. గతంలో ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదు.. ప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు రావాలని కోరుకుంటారు.. ఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు అని మండిపడ్డారు.
Read Also: Gorakpur: ఎవర్రా మీరంతా.. 15 ఏళ్ల బాలుడిపై అమ్మాయి అత్యాచారం..
ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రులను దోచుకోవాలని నీచమైన ఆలోచన రావటం దురదృష్టకరం అన్నారు బొత్స.. ఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తాం.. కళ్లుండి చూడలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అని మండిపడ్డారు.. ఇప్పటివరకు అమరావతి లో ఏం చేశారు.. ఎంత ఖర్చు పెట్టారు..? అని ప్రశ్నించారు. ఇక, మెడికల్ కాలేజీలపై మేం ఎంత ఖర్చు చేశామో వాళ్లే చెప్తున్నారు.. కానీ, పీపీపీ అంటే దోపిడీ.. నా పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..? అని నిలదీశారు.. ఎవరు చెప్పారు ఇది.. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు.. చేతకాకపోతే ఏదీ కాదు.. ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన ఉండాలి అని సూచించారు మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ..
