NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: నేడు జనసేనలోకి కీలక నేతలు.. కండువా కప్పి ఆహ్వానించనున్న పవన్‌..

Janasena

Janasena

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. ఇలా వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు.. టీడీపీ గూటికి చేరగా.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీ కండువాలు కప్పుకున్నారు.. అయితే, ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు..

Read Also: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై ఇండియన్స్‌కు భారీ ప్రయోజనం!

నేడు జనసేనలో చేరనున్నారు వైసీపీ కీలక నేతలు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య.. దీని కోసం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.. ఇవాళ అతికొద్ది మంది మాత్రమే బాలినేనితో పాటు పార్టీలో చేరనుండగా.. త్వరలో ఒంగోలు వేదికగా భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇక, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయగా.. మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీగా బయల్దేరి జనసేన కార్యాలయానికి చేరుకోనున్నాఉ ఉదయభాను.. మరోవైపు.. ఇటీవలే వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశమై చర్చించారు.. ఆయనతోపాటు వియ్యంకుడు రవిశంకర్‌ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోశయ్య.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు కిలారి రోశయ్య..