Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరానికి అతితీవ్ర తుఫాన్ అర్నబ్ వేగంగా దూసుకొస్తోంది. తుఫాన్ బాహ్య వలయం ఇప్పటికే భూభాగాన్ని తాకుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, కాకినాడ సమీపంలో యానాం దగ్గర తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తుఫాన్ పూర్తిస్థాయిలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక, గడిచిన 6 గంటల్లో అర్నబ్ తుఫాన్ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు 90 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 170 కిలోమీటర్లు, బాపట్లకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించారు.
తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు
అర్నబ్ తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటిన అనంతరం తీవ్ర తుఫాన్‌గా బలహీనపడి, ఆ తర్వాత క్రమంగా తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి 28 ప్రాంతాల్లో అతిభారీ వర్షపాతం నమోదుకాగా, మరో 133 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Also Read
- Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
- AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
- Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
- AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే తాజా హెచ్చరికలను గమనిస్తూ, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!