Rushikonda buildings: గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలపై తీవ్ర వివాదమే నడిచింది.. ఇప్పటికీ దానిపై కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇక, ఇవాళ కౌల్సిల్ వేదికగా రుషికొండ అంశంపై మరోసారి రచ్చ జరిగింది.. దీనిపై శాసన మండలిలో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్.. ఎండాడ భూములు, రుషికొండ అంశంలో స్ధానికుల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందని విమర్శించారు.. రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండ బీచ్ అన్నారు.. అయితే, అన్ని అద్భుతంగా ఉండగానే రిసార్ట్స్ పడగొట్టేశారని మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్..
Read Also: Sleeping With Jeans: జీన్స్ వేసుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
ఇక, రుషికొండలో నిర్మాణాల విలాసాలున్నాయన్న మరికొందరు సభ్యులు ఆరోపించారు.. దీంతో.. రుషికొండ నిర్మాణాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మధ్య సీరియస్‌గా వాగ్వాదం చోటు చేసుకుంది.. చేసిన తప్పు ఒప్పుకోవాలని సూచించారు అచ్చెన్నాయుడు.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎస్‌ఎఫ్‌టీ రూ.25వేలకు పైగా నిర్ణయించారని దుయ్యబట్టారు..
Read Also: Baaghi4 : బాబోయ్ టైగర్ ష్రాఫ్.. సీక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు
అయితే, సభలో మంత్రుల మాటలు దారుణంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు వైసీపీ ఎంఎల్సీ బొత్స సత్యనారాయణ.. ఒకరేమో దమ్ము ఉందా.. రండి చూసుకుందాం.. సిగ్గుందా.. అంటూ మాట్లాడుతున్నారన్న ఆయన.. రిషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలుగా కట్టాం.. దానిని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరి కోసమైనా వాడతాం.. సీఎం, డిప్యూటీ సీఎం అందరూ చూసి వచ్చారు కదా? తత్కాలిక భవనాలకు అమరావతిలో ఫుర్నీచర్ తో కలిపి ఎప్‌ఎఫ్‌టీ 14 వేలు ఖర్చు చేశారు.. రిషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలు.. ఆ భవనాలన్ని బాగా కట్టారు అని సీఎం, డిప్యూటీ సీఎంలే చెప్పారు కదా? అని ప్రశ్నించారు.. అందులో ఏదైనా లోపం జరిగితే విచారించుకోండి.. అవి ప్రభుత్వ భవనాలు, జగన్ సొంత భవనాలు కాదు కదా? అంటూ హితవుచెప్పారు బొత్స..