AP Weather Alert: అలర్ట్.. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Alert: ఇప్పటికే అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావాల కారణంగా, రాత్రి సమయంలో కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
Read Also: TPCC Mahesh Goud : డీసీసీ కమిటీలను ప్రకటించిన టీపీసీసీ చీఫ్
Also Read
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
పంటలకు మరియు ప్రజలకు సూచనలు
మినుము, మిరప, పసుపు వంటి పంటలను తడవకుండా భద్రపరచుకోవాలని సూచించారు.. వర్షాల సమయంలో చెట్ల కింద నిలకండి, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. అప్రమత్తంగా ఉండండి.. అవసరమైతే భద్ర స్థలాల్లో తల దాచుకోండి. విద్యుత్ సమస్యలు, నీరు నిలిచే ప్రాంతాలు, గాలి వేగం ఎక్కువ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని సూచించారు.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్, ఎండీ ప్రకారం, అన్ని అధికారులు మరియు పౌరులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
-
Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న ‘మండాడి’ డైరెక్టర్!
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..