MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించేందుకు 40,679 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు పేర్కొన్నారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఎన్నికల సమయంలో నిరంతర పర్యవేక్షణ కోసం 3,488 రూట్ మొబైల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 931 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 847 ఎస్ఎస్టీ బృందాలను రంగంలోకి దించారు. రాష్ట్రవ్యాప్తంగా 412 చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. అలాగే 547 పికెట్ కేంద్రాల వద్ద 1,381 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read
- YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
- CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
- CM Chandrababu: తుఫాన్‌ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
సీసీటీవీలు, డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ
ఎన్నికల భద్రతను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు, వీడియో ఫుటేజ్‌ను వినియోగించనున్నారు. పోలీసు సిబ్బంది విధుల నిర్వహణను సమర్థ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఎన్నికల విధుల్లో పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ వివరించారు. ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ బాక్సుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 178 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి, వాటి వద్ద నిరంతరం పోలీసు పహారా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
-
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
-
US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!