Minister Kondapalli Srinivas in New York: న్యూయార్క్‌లో ఏపీ మంత్రి పర్యటన.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ
- న్యూయార్క్ లో పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
- వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం..
- ప్రపంచ బ్యాంకు ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్‌తో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kondapalli Srinivas in New York: న్యూయార్క్ లో పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఈ పర్యటనలో భాగంగా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అయ్యారు.. ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ మేనేజర్ మరియు సహజ పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్‌తో ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు… వరదలు, కరువు నివారణకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై చర్చలు జరిపారు.. మైక్ వెబ్‌స్టర్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పని విధానాన్ని, పకృతి వనరులను కాపాడటంలో ఆయన కున్న చిత్తశుద్ధిని కొనియాడారు. గతంలో చిత్తూరు జిల్లాలో తమ బృందం పనిచేసిన అనుభవాన్ని, అప్పట్లో తమకు అందిన ప్రోత్సాహన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో తమకు అవకాశం అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు, కరువు నివారణ కోసం తప్పకుండా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.
Read Also: T20 World Cup 2024: టీమిండియా మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
ఇక, వరదలు, కరువు నివారణ చర్యలపై చేపట్టే ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని మైక్ వెబ్‌స్టర్ హామీ ఇచ్చారు. మైక్ వెబ్‌స్టర్ హామీ ఇవ్వడం పట్ల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు. షెల్ ఫౌండేషన్ సీఈవో జోనాథన్ బెర్మాన్ మరియు పోర్ట్‌ఫోలియో అధిపతి మీరా షాతోనూ సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. సన్న, చిన్నకారు రైతులు, గ్రామీణ పేదరిక నిర్మూలన (SERP) కార్యకలాపాల గురించి చర్చలు జరిపారు.. వ్యవసాయం రంగంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచడం కోసం, నూతన ఆవిష్కరణలను రావల్సిన అవసరాన్ని.. జోనాథన్ బెర్మాన్, మీరా షాతో చర్చించారు మంత్రి శ్రీనివాస్.. సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకురావడంలో వారు ఎలా సహకరించాలి అనే విషయంపై చర్చించారు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ పర్యటనపై ఆయన కార్యాలయం ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!