NTV Telugu Site icon

AP Latest Weather Report: వాతావరణశాఖ తాజా రిపోర్ట్.. ఏపీలో ఈ ప్రాంతాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..

Heavy Rains

Heavy Rains

AP Latest Weather Report: ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాల్లో వరుసగా స్కూళ్లకు సెలవులుగా ప్రకటిస్తూ వస్తున్నారు.. అయితే, మరో మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీద ఉంది. దాని అనుబంధ ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్నది. ఇది దాదాపు ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ సెప్టెంబరు 9 నాటికి వాయువ్య బంగాళాఖాతం మరియు గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా మరియు బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, తదుపరి 3-4 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్ మరియు ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతుందని వాతావరణశాఖ పేర్కొంది..

Read Also: India: ప్రపంచంలో రెండో అతిపెద్ద 5G మొబైల్ మార్కెట్‌గా భారత్..

ఇక, సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి బికనీర్, నార్నాల్, సిధి, సంబల్‌పూర్ , మధ్య బంగాళాఖాతం మరియు దాని ప్రక్కనే ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడి ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా కొనసాగుతోంది.. దీంతో.. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం విషయానికి వస్తే.. ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశం ఉందని తెలిపింది.. ఇక, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశ ఉందని తెలిపింది..

Read Also: Kolkata doctor case: వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ అప్‌డేట్ ఇదే!

మరోవైపు.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీస్తాయని.. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.. ఇక, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి.. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Show comments