నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో.. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందంటోంది వాతావరణ శాఖ..
మరో మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీద ఉంది. దాని అనుబంధ ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్నది. ఇది దాదాపు ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ సెప్టెంబరు…