AP Inter Results 2025: బాలికలదే పై చేయి.. కృష్ణా జిల్లా ఫస్ట్.. అల్లూరి, చిత్తూరు జిల్లాలు లాస్ట్..
- ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..
- ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత..
- ఇంటర్ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత.. సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు.. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది అన్నారు మంత్రి నారా లోకేష్. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు మరియు విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణంగా పేర్కొన్నారు..
Read Also: CSK Playoffs Chances: వరుసగా ఐదు ఓటములు.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఇలా!
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఇంటర్ రెగ్యులర్ ఫస్టియర్ పరీక్షలకు 4,87,295 మంది విద్యార్థులు, ఇంటర్ రెగ్యులర్ సెకండియర్ పరీక్షలకు 4,22,030 మంది విద్యార్థులు హాజరు కాగా.. మొత్తం రెగ్యులర్ విద్యార్థుల సంఖ్య 9,09,325గా ఉంది.. ఒకేషనల్ విద్యార్థులు ఫస్టియర్‌లో 38,553 మంది, సెకండియర్‌లో 33,289 మంది కలిపి మొత్తం 71,842 మంది విద్యార్థులు హాజరయ్యారు.. ఇక, ప్రైవేట్‌గా పరీక్షలు రాసిన విద్యార్థులు 35,935 మంది.. మొత్తంగా ఇంటర్ ఫస్టియర్‌లో 5,25,848 మంది, సెకండియర్‌లో 4,91,254 మంది విద్యార్థులు కలుపుకొని 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు అయ్యారు.. అయితే, రెగ్యులర్ ఇంటర్ 3,51,521 మంది అంటే 83 శాతం మంది.. ఫస్టియర్‌లో 3,42,979 మంది అంటే 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఒకేషన్ ఫస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 62 శాతం ఉత్తీర్ణులయ్యారు.. ఇక, రెగ్యులర్ ఇంటర్ సెకండియర్‌లో బాలుర ఉత్తీర్ణత శాతం 80 శాతంగా ఉంటే.. బాలికలు 86 శాతంతో పై చేయి సాధించారు.. ఇంటర్ ఫస్టియర్లోలో బాలురు 66 శాతం ఉత్తీర్ణులైతే.. బాలికలో 75 శాతంతో ముందు వరుసలో నిలిచారు.. ఒకేషన్ సెకండియర్‌లో బాలురు 67 శాతం, బాలికలు 84 శాతం.. ఫస్టియర్‌లో బాలురు 50 శాతం, బాలికలు 71 శాతం పాస్ అయ్యారు..
Read Also: Rajinikanth : ‘జైలర్ 2’ షూటింగ్ అప్డెట్..
మరోవైపు ఇంటర్ ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. గుంటూరు 91 శాతంలో రెండో స్థానంలో.. ఎన్టీఆర్ జిల్లా 89 శాతంతో మూడో స్థానంలో.. తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం 87 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామ రాజు జిల్లా.. అనకాపల్లి చివరి స్థానంలో నిలిచాయి.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే.. వరుసగా 82 శాతం, 81 శాతం, 79 శాతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం నిలిచాయి.. ఇక, 54 శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా అట్టడుగు స్థానానికి పరిమితమైంది..
Read Also: Nitish Kumar: తెరపైకి ఉప ప్రధాని పదవి.. నితీష్‌కి ఇవ్వాలని మిత్రపక్షం డిమాండ్
ఇక, వచ్చే నెల 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.. మరోవైపు.. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలి.. ఉత్తీర్ణత కాని వారు నిరాశ పడవద్దు.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ పరీక్షలు రాయాలని సూచించారు.. ప్రభుత్వ కాలేజీలలో మంచి ఫలితాలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!