AP High Court: సర్కార్‌పై హైకోర్టు సీరియస్.. ఏంటి ఈ నిర్లక్ష్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. గిరిజన ప్రాంతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన ప్రాంతాల్లోని 595 గ్రామపంచాయతీలకు చెందిన 878 రెవెన్యూ గ్రామాల జాబితా ఇప్పటికీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ జాబితాను సరిహద్దులతో సహా వెంటనే గిరిజన సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అయితే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఇప్పటికే ఈ 878 రెవెన్యూ గ్రామాల జాబితాను సిద్ధం చేసినప్పటికీ, దానిని అధికారికంగా ప్రచురించడం లేదని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి. వెంకట శివరాం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. జాబితా అందుబాటులో లేకపోవడంతో గిరిజన యువత, పేద కుటుంబాలు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందలేకపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని గిరిజనేతరులు షెడ్యూల్ ప్రాంతాల్లో సారవంతమైన భూములను ఆక్రమించడం, అక్రమ మైనింగ్, వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. షెడ్యూల్డ్ ఏరియాలపై స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల గిరిజనులకు రావాల్సిన భూములు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు దూరమవుతున్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 878 రెవెన్యూ గ్రామాల పూర్తి వివరాలను వెంటనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!