సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. గతంలో విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన విషయం విదితమే..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పటికే క్వాష్ పిటిషన్ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం విదితమే కాగా.. అయితే, ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు..