Site icon NTV Telugu

AP High Court: హైకోర్టుకు కాకినాడ పోర్టు ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం

Ap High Court

Ap High Court

AP High Court: హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం..తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది.. అయితే, దీనిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది హైకోర్టు.. నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించింది.. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది.. అయితే, తమ బియ్యాన్ని నౌకలో లోడు చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ ఎక్స్ పోర్టు, పద్మశ్రీ రైస్ మిల్, సూర్యశ్రీ రైస్ మిల్ యజమానులు భాస్కరరెడ్డి. గంగిరెడ్డి, విశ్వనాధ రెడ్డి ఆరోపిస్తున్నారు.. దీనిపైనే హైకోర్టు మెట్లు ఎక్కారు.. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. అయితే, వివరాలు సమర్పించేందుకు తమకు సమయం కావాలని ఈ సందర్భంగా హైకోర్టును కోరారు అడిషనల్ అడ్వకేట్ జనరల్.. దీంతో.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..

Read Also: Heavy Rains in AP: ఏపీలో మళ్లీ వర్షాలు.. 4 రోజుల పాటు కోస్తా, రాయలసీమ భారీ వర్ష సూచన..

Exit mobile version