Site icon NTV Telugu

AP High Court: వల్లభనేని వంశీ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా..

Ap High Court

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు నిరాశ ఎదురైంది.. అక్రమ మైనింగ్ కేసులో తనపై పీటీ వారెంట్ దాఖలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది.. అయితే, దిగువ కోర్టు పీటీ వారెంట్ అనుమతించినా వచ్చే గురువారం వరకు వారెంట్ అమలు చేయబోమని కోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇక, వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరగగా.. వంశీ మోహన్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..

Read Also: Vizag Deputy Mayor: ఎట్టకేలకు విశాఖ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం..

మరోవైపు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెండు రోజులు కస్టడీ కోరుతూ హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిసాయి.. భోజన విరామం అనంతరం తీర్పు వెల్లడించనున్నారు నూజివీడు కోర్టు న్యాయమూర్తి..

Exit mobile version