Amaravati Development: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలకు శుభవార్త చెప్పింది.. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.1,863 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. అలాగే విద్యుత్ మరియు ఐసిటి యుటిలిటీ డక్టులు, పునర్వినియోగ నీటి లైన్, స్టీపీ (STP), అవెన్యూ ప్లాంటేషన్ నిర్మాణ పనులు చేపట్టనుంది.
Read Also: Amaravati Land Allotment: 11 ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులు.. ప్రభుత్వం ఆదేశాలు..
ఇక, ఈ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ జారీ చేశారు. ఓవైపు రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ.. మరోవైపు కీలకమైన నిర్మాణాలు చేపడుతూ.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే.. రాజధాని ప్రాంతంలోని గ్రామాలను సైతం అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టింది.. అందులో భాగంగా.. భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది..
