Site icon NTV Telugu

Banakacherla Project: ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం..! బనకచర్ల ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ టెండర్లు రద్దు..

Banakacherla Project

Banakacherla Project

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్‌ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అయితే, అక్టోబర్‌ 11వ తేదీన బనకచర్ల ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ కోసం టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం.. ఇక టెండర్ల దాఖలుకు అక్టోబర్‌ 31వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది సర్కార్.. తాజాగా డీపీఆర్‌ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో.. డీపీఆర్‌ టెండర్ల రద్దు ఆసక్తికరంగా మారింది. కానీ, వివాదాల కారణంగా బనకచర్ల డీపీఆర్‌ టెండర్లను రద్దు చేశారా? లేదా టెండర్లు రాక పోవడంతో రద్దు చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది..

Read Also: Bhagavad Gita Controversy: పోలీస్ ట్రైనింగ్లో భగవద్గీత పఠనం.. మధ్యప్రదేశ్లో వివాదం..

కాగా, బనకచర్ల ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొనగా.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది.. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.. అయినా.. ఏపీ సర్కార్‌ టెండర్లకు వెళ్లినా.. ఇప్పుడు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది..

Exit mobile version