NTV Telugu Site icon

Andhra Pradesh: సంక్షేమ పథకాలు అమలు.. ఫీడ్‌ బ్యాక్‌లో షాకింగ్‌ విషయాలు..!

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు.. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల అమలుపై ఫోకస్‌ పెట్టింది.. ఒక్కకటిగా అమలు చేస్తూ వస్తోంది.. అయితే, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షమ పథకాల విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేదా ఏదైనా అసంతృప్తి ఉందా? అనే కోణంపై దృష్టిసారించింది ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా.. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది ప్రభుత్వం.

Read Also: US-India Tariffs: అమెరికాపై ప్రతీకార సుంకాలపై భారత్ కీలక ప్రకటన

అయితే, సంక్షేమ పథకాల అమలు తీరులో ప్రభుత్వం తీసుకున్న ఫీడ్‌ బ్యాక్‌లో కొన్ని షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయటన.. సామాజిక పెన్షన్లు, ఆరోగ్య సేవలు, రెవెన్యూ సర్వీసెస్, పోలీస్ సేవల విషయంలో ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటుంది ప్రభుత్వం.. కానీ, సామాజిక పెన్షన్ల విషయంలో కొంతమంది లంచం అడుగుతున్నట్టుగా ఫీడ్‌ బ్యాంక్‌లో ప్రభుత్వం దృష్టికి వచ్చిందట.. అదే విధంగా డ్రగ్స్ కట్టడి చేయడంలో పోలీసులు విఫలం చెందుతున్నారని ఫీడ్‌బ్యాక్‌లో ప్రభుత్వం గుర్తించింది.. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పనితీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ కోసం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సర్కార్‌ సిద్ధమవుతోంది.. ఉద్యోగులు.. అధికారుల పనితీరుపై రియల్ టైమ్‌లో మానిటరింగ్ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. ఎవరెవరు ఏ స్థాయిలో పబ్లిక్ సర్వీస్ విషయంలో ముందున్నారనే అంశంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుంది ప్రభుత్వం..