Site icon NTV Telugu

AP Government: మైనార్టీ విద్యార్థులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణ..

Minister Md Farooq

Minister Md Farooq

AP Government: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు.. ఈ సెంటర్ల ద్వారా.. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.. ఏపీ- టెట్ 2024కు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉర్దూ, తెలుగు మీడియంలో శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు.

Read Also: 24 Frames Factory: మాకు యూట్యూబ్ వివాదానికి సంబంధం లేదు.. మంచు విష్ణు నిర్మాణ సంస్థ కీలక ప్రకటన!

ఇక, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) మైనార్టీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని.. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి ఫరూక్‌.. రాష్ట్రంలోని జిల్లాల వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. మైనారిటీ విద్యార్థులు రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆయా కేంద్రాల ద్వారా ఉచితంగా శిక్షణ పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు.. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ విద్యార్థుల సంక్షేమాన్ని, విద్యా అవకాశాలలో జగన్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని.. మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు.. జగన్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రగతి పూర్తిగా కుంటుపడిందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వ ధోరణితో విసిగిన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీతో పట్టం కట్టారన్నారు.. ఇక, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

Read Also: Kangana Ranaut: మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడింది..

మైనారిటీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు జిల్లాల వారీగా 19 కేంద్రాల ఏర్పాటు చేశారు.. సీఈడీఎం ప్రధాన కార్యాలయం(విజయవాడ), ఆర్ సీఈడీఎం ఏఎం కాలేజ్ (గుంటూరు), ఉస్మానియా కాలేజ్ (కర్నూల్), ఆర్ సీఈడీఎం ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ (విశాఖపట్నం), ఆర్కే బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ (గుంటూరు), జోయా కోచింగ్ సెంటర్(నంద్యాల), సీఈడీఎం స్టడీ సెంటర్ (కదిరి), గవర్నమెంట్ యుహెచ్ స్కూల్(రాయదుర్గం), కుట్టి ఎడ్యుకేషనల్ సొసైటీ (అనంతపురం), ఎంయూహెచ్ స్కూల్ (మదనపల్లె), శ్రీ వెంకటేశ్వర కోచింగ్ సెంటర్ (తిరుపతి), శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ (తిరుపతి), డజలింగ్ టాలెంట్ అకాడమీ, మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ (పొద్దుటూరు), ఆజాద్ కోచింగ్ సెంటర్ (రాయచోటి), గవర్నమెంట్ హై స్కూల్ (కంభం), భావపురి విద్యాసంస్థలు (బాపట్ల), నోబుల్ కాలేజ్ (మచిలీపట్నం), వెంకటసాయి అకాడమీ (కడప)లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు మంత్రి ఫరూక్‌.. ప్రతి పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ కల్పించి కార్పొరేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందే విధంగా.. ధనిక విద్యార్థులతో ధీటుగా పోటీపడి విజయం సాధించే విధంగా మైనారిటీ విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెంపొందిస్తామన్నారు మంత్రి ఫరూక్.

Exit mobile version